పేజీలు

25 జనవరి 2013



                       తాపీ మేస్ర్తీలకూ వాస్తు... !

ఇళ్ళు, గుడి, బడి ఇలా ఏ నిర్మాణం చేపట్టినా.. భారతీయ సాంప్రదాయంలో వాస్తుకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఏ మూలలో ఏది ఉండాలనేది ముందుగానే నిర్ణయించి.. తదనగుణంగా నిర్మాణాన్ని పూర్తిచేయడం ఆనవాయితీ. అయితే.. వాస్తు అనేది గృహస్తులకు, నిర్మాణాలకేనా? ఆ నిర్మాణాల్లో పాలుపంచుకునే తాపీ మేస్ర్తీలకు వర్తించదా? అంటే.. కచ్చితంగా వర్తిస్తుంది అంటున్నాయి వాస్తు శాస్త్రాలు. మరి నిర్మాణాల్లో కీలకపాత్ర పోషించే తాపీ మేస్ర్తీలు ఎలాంటి వాస్తు సూచనలు పాటించాలో ఈవారం తెలుసుకుందాం..
thapi-bukketగృహ నిర్మాణాల్లో పాలుపంచుకునే తాపీ మేస్ర్తీలు మొదలుకొని.. ఇటుకలు, ఇసుక, కాంక్రీటు ఇలా ప్రతి పనిలో భాగస్వామ్యం పంచుకునే కూలీలకు సైతం వాస్తు సూచనలు తప్పనిసరి. అయితే.. కూలీలకంటే గృహనిర్మాణంలో కీలకపాత్ర పోషించే.. తాపీ మేస్ర్తీలే ఎక్కువ నియమాలు పాటించాల్సివుంటుంది. వీరు గృహ నిర్మాణ సమయంలో జాగ్రత్తగా వ్యహరిస్తేనే నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తవడమే కాకుండా.. బిల్డర్‌ లేదా యజమాని ఆశించిన రీతిలో నిర్మాణం పూర్తవుతుంది.


ఇంత ప్రాధాన్యత ఉన్న తాపీ మేస్ర్తీలకు వాస్తు శాస్త్రంలో కొన్ని సలహాలు పేర్కొనడం జరిగింది. వీరు గృహ నిర్మాణం చేపట్టే సమయంలో కొన్ని కీలక గుర్తులతో పాటు.. దిశలను ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా ప్లాన్‌ ప్రకారం గుర్తులు వేసుకోవాలి. అప్పుడు నైరుతి దిశ 90 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి.తాపీ మేస్ర్తీ నిర్మాణానికి దిగేముందు మూలమట్టాన్ని ముందుగా నైరుతి దిశలో ఉంచాలి. ఆ తరువాతే ఇతర దిక్కుల్లో దిశలను మార్క్‌ చేసుకోవాలి. ఈ మార్కులు చేసుకునేటప్పుడు ఇతర మూలల కంటే.. ఈశాన్యం కొద్దిగా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి పునాదులు తీసేటప్పుడు ముందుగా ఈశాన్యం మూల నుంచి ప్రారంభించాలి. అయితే.. కట్టడం మాత్ర నైరుతి దిశ నుంచి ప్రారంభించాలి.


హద్దులను బట్టి ముందుగా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలి. పశ్చిమ-నైరుతి దిశలో కొంత ఎతె్తైన గోడను నిర్మించి, ఆ తరువాత ఇంటి నిర్మాణం చేపట్టాలి. అలాగే. ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తు సామాగ్రిని నైరుతి, పశ్చిమ, దక్షిణ భాగాల్లో మాత్రమే జాగ్రత్త చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య భాగంలో మాత్రం ఉంచకూడదు. గోడల నిర్మాణంలో ఏ రోజుకారోజు.. దక్షిణ-పశ్చిమ గోడలు.. తూర్పు, ఉత్తర గోడల కంటే కొంచెం ఎత్తుగా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే.. ఫ్లోరింగ్‌ వేసే సమయంలోను జాగ్రత్తగా చూసుకోవాలి. వీటితో పాటు మరికొన్ని జాగ్రత్తలను మేస్ర్తీ పాటించాలి.

పడకగది ఇలా...

ప్రతి గృహంలో నిర్మాణానికి చాలా సూత్రాలు పాటిస్తూ వస్తుంటాం. అలాగే ఇంటి యజమాని సంతోషాన్ని రెట్టింపు చేసేది పడకగది. అటువంటి పడకగది నిర్మాణంలో నియమాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పడకగదిలో మంచాన్ని మన ఇష్టం వచ్చినట్లు వేసుకుంటే.. అది మన ఆరోగ్య, మానసిక విషయాలు మీద చెడు ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. పడకగది తలుపుకి ఎదురుగా మంచం ఉండకూడదు. మంచం తలుపులకి, కిటికీలకు ఎదురుగా ఉండరాదు. అందువల్ల వాటిద్వారా గదిలోకి వచ్చే వెలుతురువల్ల మన నిద్రకు భంగం కలుగుతుంది.
furnicture house-furniture

అద్దాన్ని కాని, డ్రెస్సింగ్‌ టేబుల్‌ని కాని మంచానికి తలవైపు కాని, కాళ్లవైపు కాని ఉంచకూడదు. మనిషి నిద్రించే సమయంలో ఆత్మ శరీరం నుండి విడివడి గదంతా తిరుగుతుందని చైనీయుల విశ్వాసం. శరీరం నుండి ఆత్మ బయటకు రాగానే అద్దంలో తన ప్రతిబింబం చూసుకుని కంగారు పడుతుంది. దానివలన లేనిపోని అనర్ధాలు కలుగుతాయి. నిద్రాసమయంలో ఆత్మ శరీరం నుండి బయట పడుతుందనే నమ్మకం మనదేశంలోనూ ఎక్కువగానే ఉంది.

బుక్‌షెల్ఫ్‌, డ్రెస్సింగ్‌ టేబుల్‌ అంచుల నుండి వీచే సూటి గాలులు మనిషి ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. బెడ్‌రూమ్‌లో అనవసరమైన చెత్త ఉంచకూడదు. పెట్టెలు, పుస్తకాలు, ఉపయోగపడని గృహోపకరణాలు ఉండకూడదు. టెలివిజన్‌, రేడియో, కంప్యూటర్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ సాధనాలు పడకగదిలో ఏర్పాటు చేసుకోకపోవడమే మంచిది. తద్వారా నిద్రకు భంగం కలుగదు. ఎట్టి పరిస్థితులోనూ మంచాన్ని ఏటవాలుగా ఉండే సీలింగ్‌ కిందకాని, స్థంబాల కిందకాని ఉండకూడదు. ఒకవేళ వీటికింద తప్పనిసరి పరిస్థితుల్లో మంచాన్ని వేసుకోవల్సి వస్తే రెండు వెదురు వేణువులను పైన వేలాడదీయండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి