పేజీలు

తెలుగు వ్యాకరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు వ్యాకరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11 మార్చి 2013

సంధులు

సంస్కృత సంధులు -


1.సవర్ణదీర్ఘ సంధి - ఆ,ఇ,ఉ,ఋ లకు సవర్ణములగు అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశంబగును.

ఉదా - రాజు + ఆజ్ఞ = రాజాజ్ఞ,ముని + ఇంద్ర = మునీంద్ర

2.గుణసంధి - అకారమునకు ఇ,ఉ,ఋ లు పరమయినపుడు ఏ,ఓ,ఆర్ లు ఏకాదేశముగా వచ్చెను.

ఉదా - దేవ + ఇంద్ర = దేవేంద్ర, రాజ + ఋషి = రాజర్షి

3.వృధ్ది సంధి - అకారమునకు ఏ,ఐలు పరమైన ఐ కారమును ఓ,ఔ లు పరమైన ఔ కారమును ఏకాదేశముగా వచ్చును.

ఉదా - ఏక + ఏక = ఏకైక,దేశ + ఔన్నత్యము = దేశౌన్నత్యము

4.యణాదేశ సంధి - ఇ,ఉ,ఋ లకు అసవర్ణములగు అచ్చులు పరమగునపుడు వరుసగా య,వ,ర ఔ ఆదేశముగా వచ్చెను.

ఉదా - అతి + అంతము = అత్యంతము, మను + అంతరము = మన్వంతరము

5.అనునాశిక సంధి - క,చ,ట,త,ప లుకు స,మ లు పరమైనపుడు వరుసగా జ,ణ,జ్ఞ,మ లు వికల్పముగా ఆదేశమగును

ఉదా - వాక్ + మయము = వాజ్మయము

6.శ్చత్య సంధి - స,త,థ,ద,ధ,స లకు శ,చ,చ,జ,ఝ,జ్ఞ లు పరమైనపుడు వరుసగా జ్ఞ,ణ,మ లు వికల్పముగా ఆదేశంగును.

ఇదా - మనస్ + శాంతి = మనశ్శాంతి,జగత్ + జనులు = జగజ్జనులు

7. విసర్గ సంధి - విసర్గమునకు శ,ష,స లు పరమైనపుడు వరుసగా శ,ష,స లు ఆదేశబగును

ఉదా - చతు + శతాబ్దములు = చతుశ్శతాబ్దములు

  తెలుగు సంధులు -

1.అకార సంధి - అత్తునకు సంధి బహుళము.

ఉదా - మేన + అత్త = మేనత్త, రామ + అయ్య = రామయ్య

2.ఇకార సంధి - ఏమ్యాదుల ఇత్తునకు సంధి వికల్పము

ఉదా - ఏమి + అంటివి = ఏమంటివి

3.ఉకార సంధి - ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యము.

ఉదా - రాముడు + అతడు = రాముడతడు

4. యడగమ సంధి - సంధిలేని చోట స్వరంబుకంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు రెండు అచ్చులకు సంధి జరగనపుడు వాని మధ్య 'య్' అనునది ఆగమముగా వచ్చును.

5.ఆమ్రేడిత సంధి - అచ్చునకు ఆమ్రేడితము పరమగునపుడు సంధి తరచుగానగును.

ఉదా - కడ + కడ = కట్టకడ, ఏమి + ఏమి = ఏమేమి, మొదట + మొదట = మొట్టమొదట

6.త్రిక సంధి - ఆ,ఈ,ఏ,యను సర్వనామములకు త్రికమని పేరు.

ఉదా - ఈ + త్తనవు = ఈత్తనువు.

7.గసడదవాదేశ సంధి - ప్రదము మీది పరుషములకు గ,స,డ,ద,వ లు బహుళములగును.

ఉదా - రాజ్యము + చేయు = రాజ్యముసేయు, వాడు + వచ్చె = వాడొచ్చె

8.పుంప్వాదేశ సంధి - కర్మధారయ సమాసమున సువర్ణమునకు పుంపు లగును.

ఉదా - సరసము + మాట = సరసపుమాట

9.రుగాగమ సంధి - పేదాదుల కాలు పరమయినపుడు రగాగము వచ్చును.

ఉదా - పేద + ఆలు = పేదరాలు

10.పడ్వాది సంధి - పడ్వాదులు పరమగునపుడు సువర్ణమునకు లోప పూర్ణబిందువులు వికల్పములగును.

ఉదా - భయము + పడు = భయపడు

11.టుగాగమ సంధి - కర్మధారయ సమాసమునందు ఉకారాంత పదమునకు అచ్చు పరమైనపుడు టుగాగమంబగు.

ఉదా - చిగురు + ఆకు = చిగురుటాకు, పండు + ఆకు = పండుటాకు

12.సుగాగమ సంధి - షష్టీ తత్పురుష సమాసమునందు ఉకార ఋకారాంత శబ్దములకు అచ్చు పరమగునపుడు సుగాగమము వచ్చును.

ఉదా - చేయి + అతడు = చేయునతడు

13. ప్రాతాది సంధి - సమాసములందు ప్రాతాదుల తొలి అచ్చుమీది వర్ణములకెల్ల లోపంబు బహుళముగానగును

ఉదా - ప్రాత + ఇల్లు = ప్రాత యిల్లు

14. ఆమ్రేడిత సంధి - అచ్చునకు ఆమ్రేడితము పరమయునపుడు సంధి తరచుగానగును.

ఉదా - ఏమి + ఏమి = ఏమేమి

15.ద్రుత సంధి - ద్రుత ప్రకృతికముల మీద పరుషములకు సరళమగును.

ఉదా - పూచెను + కలువలు = పూచెను గలువలు

16.ము వర్ణలోప సంధి - లు,ల,న లు పరమగునపుడు ము వర్ణమునకు లోపంబు తత్పూర్వస్వరమునకు ధీర్ఘము విభాషమగు.

ఉదా - పొలము + లు = పొలాలు.

17.ద్విగు సమాస సంధి - సమానాధికారణంబగు ఉత్తరు పదంబు పరంబగునపుడు మూడు శబ్దములలో డు వర్ణమునకు లోపంబగును. మీది హాల్లునకు ద్విత్వంబగును.

ఉదా - మూడు + లోకములు = ముల్లోకములు

18.బహువ్రిహి సమాస సంధి - బహువ్రీహిని స్త్రీ వాచ్యంబునగుచో ఉపమానంబు మీది మేనునకు జొడి అగును

ఉదా - అలరు + మేను = అలరు జొడి

19.అల్లోప సంధి - అది, అవి శబ్దముల అకారమునకు సమాసమున లోపము బహుళముగానగు.

ఉదా - నా + అది = నాది

20.దుగాగామ సంధి - నీ,నా,తన శబ్దములకు ఉత్తర పదము పరమగునపుడు దుగాగమము వికల్పముగా వచ్చును.

ఉదా - నీ + చూపు = నీదు చూపు

21.డు వర్ణలోన సంధి - సమానాధికరణంబగు ఉత్తరపదంబు పరంబగునపుడు మూడు శబ్దములోని డు వర్ణమునకు లోపంబగును. మీది



తెలుగు చంధస్సు



    పద్య లక్షణాలు తెలిపెడి శాస్త్రమును ఛందోశాస్త్రము పిలుస్తారు.పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నిఛందస్సు అంటారు.గురు,లఘువులు కలయికచే ఏర్పడేవి గణాలు.ఇటువంటి కొన్ని గణముల కలయిక వలన పద్యము ఏర్పడుతుంది.

గురువుని U తోనూ
లఘువుని l తోనూ సూచిస్తారు.



లఘువులు - ఏక మాత్రాకాలంలో ఉచ్చరించబడే దానిని లఘువు అని అంటారు.(మాత్ర అనగా చిటికె వెయునంత కాలము)

హ్రస్వాచ్చులు అన్నీ లఘువులు

ఉదా - ఆ,ఇ,ఉ,ఎ,ఒ

హ్రస్వాచ్చులతో కూడిన హల్లులు లఘువులు.

ఉదా - క,చి,టు,తె,పొ

హ్రస్వమయున సమ్యుక్తాక్షరాలు లఘువులు.

ఉదా - స్వ,క్ష్మి,త్రి,క్త మెదలయునవి

హ్రస్వమయున ద్విత్వాక్షరాలు లఘువులు.

ఉదా - గ్గ,మ్మ,క్క మెదలయునవి

వట్ర సుడి గల హ్రస్వాక్షరములు లఘువులు.

ఉదా - సృ,తృ,కృ మెదలయునవి





గురువులు - ద్విమాత్రా కాలములో ఉచ్చరించబడే దానిని గురువులు అని అంటారు.

దీర్ఘాలన్నీ గురువులు

ఉదా - ఆ,ఈ,ఊ,ఏ,ఓ,ఐ

ధీర్గాచ్చులుతో కూడిన హల్లులన్నీ గురువులు.

ఉదా - సై,కా,తే,చీ

విసర్గతో కూడిన అక్షరములు గురువులు.

ఉదా - త:,దు:,అ:

సున్నా (ం) కూడిన అక్షరాలు అన్నీ గురువులు.

ఉదా - అం,కం,యం,రం

సంయుక్తాక్షరం ముందు ఉన్నవన్నీ గురువులు

ఉదా - లక్ష్మి,పద్మ

ద్విత్వాక్షరమునకు ముందున్నవన్నీ గురువులు

ఉదా - అమ్మ,అక్క,పువ్వు

పొల్లు హల్లులో కూడిన వర్ణములు గురువులు

ఉదా - ఖ,ఘ,ఛ,ఝ



తెలుగు గుణింతములు



1).క కా కి కీ కు కూ కృ కౄ కె కే కై కొ కో కౌ కం కః


2).ఖ ఖా ఖి ఖు ఖు ఖూ ఖృ ఖౄ ఖె ఖే ఖై ఖొ ఖో ఖౌ ఖం ఖః


3).గ గా గి గీ గు గూ గృ గౄ గె గే గై గొ గో గౌ గం గః


4).ఘ ఘా ఘి ఘీ ఘు ఘూ ఘృ ఘౄ ఘె ఘే ఘై ఘొ ఘూ ఘౌ ఘం ఘః


5).చ చా చి చీ చు చూ చృ చౄ చె చే చై చొ చో చౌ చం చః


6).ఛ ఛా ఛి ఛీ ఛు ఛూ ఛృ ఛౄ ఛె ఛే ఛై ఛొ ఛో ఛౌ ఛం ఛః


7).జ జా జి జీ జు జూ జృ జౄ జె జే జై జొ జో జౌ జం జః


8).ఝ ఝా ఝి ఝీ ఝు ఝూ ఝృ ఝౄ ఝె ఝే ఝై ఝొ ఝూ ఝౌ ఝం ఝః


9).ట టా టి టీ టు టూ టృ టౄ టె టే టై టొ టో టౌ టం టః


10).ఠ ఠా ఠి ఠీ ఠు ఠూ ఠృ ఠౄ ఠె ఠే ఠై ఠొ ఠో ఠౌ ఠం ఠః


11).డ డా డి డీ డు డూ డృ డౄ డె డే డై డొ డో డౌ డం డః


12).ఢ ఢా ఢి ఢీ ఢు ఢూ ఢృ ఢౄ ఢె ఢే ఢై ఢొ ఢో ఢౌ ఢం ఢః


13).ణ ణా ణి ణీ ణు ణూ ణృ ణౄ ణె ణే ణై ణొ ణో ణౌ ణం ణః


14).త తా తి తీ తు తూ తృ తౄ తె తే తే తొ తో తౌ తం తః


15).థ థా థి థీ థు థూ థృ థౄ థె థే థై థొ థో థౌ థం థః


16).ద దా ది దీ దు దూ దృ దౄ దె దే దై దొ దో దౌ దం దః


17).ధ ధా ధి ధీ ధు ధూ ధృ ధౄ ధె ధే ధై ధొ ధో ధౌ ధం ధః


18).న నా ని నీ ను నూ నృ నౄ నె నే నై నొ నో నౌ నం నః


19).ప పా పి పీ పు పూ పృ పౄ పె పే పై పొ పో పౌ పం పః


20).ఫ ఫా ఫి ఫీ ఫు ఫూ ఫృ ఫౄ ఫె ఫే ఫై ఫొ ఫో ఫౌ ఫం ఫః


21).బ బా బి బీ బు బూ బృ బౄ బె బే బై బొ బో బౌ బం బః


22).భ భా భి భీ భు భూ భృ భౄ భె భే భై భొ భో భౌ భం భః


23).మ మా మి మీ ము మూ మృ మౄ మె మే మై మొ మో మౌ మం మః


24).య యా యి యీ యు యూ యృ యౄ యె యే యై యొ యో యౌ యం యః


25).ర రా రి రీ రు రూ రృ రౄ రె రే రై రొ రో రౌ రం రః


26).ల లా లి లీ లు లూ లృ లౄ లె లే లై లొ లో లౌ లం లః


27).వ వా వి వీ వు వూ వృ వౄ వె వే వై వొ వో వౌ వం వః


28).శ శా శి శీ శు శూ శృ శౄ శె శే శై శొ శో శౌ శం శః


29).ష షా షి షీ షు షూ షృ షౄ షె షే షై షొ షో షౌ షం షః


30).స సా సి సీ సు సూ సృ సౄ సె సే సై సొ సో సౌ సం సః


31).హ హా హి హీ హు హృ హౄ హె హే హై హొ హో హౌ హౌ హం హః


32).క్ష క్షా క్షి క్షీ క్షీ క్షు క్షూ క్ష్ క్ష్ క్షె క్షే క్షొ క్షో క్షౌ క్షం క్షః


తెలుగు అక్షరమాల

   తెలుగు భాషకి అక్షరాలు 56 అవి


అచ్చులు-16


అ     ఆ     ఇ   ఈ   ఉ   ఊ


ఋ  ౠ   ఎ    ఏ    ఐ


ఒ   ఓ    ఔ    అం    అః



హల్లులు-37


క   ఖ      గ   ఘ   ఙ


చ    ఛ   జ   ఝ   ఞ


ట   ఠ   డ    ఢ    ణ


త   థ   ద   ధ   న


ప   ఫ   బ   భ   మ


య   ర   ల    వ


శ   ష   స   హ


ళ   క్ష   ఱ