పేజీలు

11 మార్చి 2013

అంకగణితము

అంకగణితము


10 మిల్లీ మీటర్లు   -  1 సెంటీ మీటరు

10 సెంటీ మీటర్లు  -  1డెసీ మీటరు

10 డెసీ మీటర్లు    -  1మీటరు

10మీటర్లు           -   1డెకా మీటరు

10డెకా మీటర్లు   -    1హెక్టా మీటరు

10హెక్టా మీటర్లు  -  1కిలో మీటరు

ద్రవ్య మానము

25పైసలు  - 1పావలా

50పైసలు  - 1అర్ధ రూపాయి

100పైసలు - 1రూపాయి

1000పైసలు - 10రూపాయలు

పాతకాలం నాటి ద్రవ్యమానము

2 దమ్మిడీలు  -1 యాగాణి

3 దమ్మిడీలు 1 కాణి

2 కాణిలు 1 అర్ధణా

2 అర్ధణాలు 1అణా

1 అణాకి 6 నయా పైసలు

మెట్రిక్ మానం

10 ఒకట్లు పది

10 పదులు వంద

100 పదులు వెయ్యి

100 వందలు పదివేలు

100 వేలు ఒక లక్ష

10 లక్షలు ఒక మిలియన్

100 లక్షలు ఒక కోటి

100 కోట్లు ఒక బిలియన్

100 మిలియన్స్ ఒక ట్రిలియన్



బంగారము-తూకము

1000 మీల్లి గ్రాములు 1 గ్రాము

1000 గ్రాములు 1 కిలో గ్రాము

8 గ్రాములు 1 కాసు

11 మిల్లి గ్రాములు 1 గురివింజ ఎత్తు

11.664 గ్రాములు 1 తులము

పాత కాలం నాటి బంగారం కోలిచే పద్దతులు

1 వీసం 1 వడ్ల గింజ ఎత్తు

2 వీసములు 1 పరక

2 పరకలు 1 పాతిక

2 పాతికలు 1 అడ్డిగ

2 అడ్డిగలు 1 చిన్నము

2 చిన్నములు 1 తులము

11 అణాల ఎత్తు 1 కాసు

20 చిన్నములు 1/2 కాసు

తూకము బరువు

1000 మీల్లి గ్రాములు 1 గ్రాము

1000 గ్రాములు 1 కిలో గ్రాము

100 కిలో గ్రాములు 1 క్వింటాలు

10 క్వంటాళ్ళు 1 మెట్రిక్ టన్ను

1016.5 కిలో గ్రాములు 1 మెట్రిక్ టన్ను

35 గ్రాములు 2 ఫలములు

1 కిలోగ్రాము 3 శేర్ల 41/2 ఫలములు

1 కిలొగ్రాము 2.20 పౌన్లు

1 కిలో గ్రాముకు 86 తులములు

భూమి కొలతలు

100 చ" మిల్లీ మిటర్లు 1 చ" సేంటి మీటరు

10,000 చ్" సేంటి మీటర్ 1 చ" మీటరు

10,00,000 చ" మీటరు 1 చ" కిలో మిటరు

1 చ"మిటరు 1.20 చ" గజములు

100 చ"మీటర్లు 1 ఆర్

100 చ" మీటర్లు 119.6 చ" గజములు

100 ఆర్లు 1 హెక్టారు

1 హెక్టారు 2.47 ఎకరములు

1 చ" కిలో మిటరు 247.10 ఎకరములు

10 హెక్టార్లు 247.10 ఎకరములు

బంగారము-తూకము

10 మీల్లి లీటర్లు 1 సేంటి లిటరు

10 సేంటి లీటర్లు 1 డేసి లిటరు

10 డెస్సి లిటర్లు 1 లీటరు

100 సెంటి లీటర్లు 1 లిటరు

10 లిటర్లు 1 డెకా లిటరు

10 డెకా లిటర్లు 1 హెక్టా లిటరు

10 హెక్టా లిటర్లు 1 కిలో లిటరు

100 డెకా లిటర్లు 1 కిలో లిటరు

1000 లిటర్లు 1 కిలో లిటరు

వస్తువులు

2 వస్తువులు 1 జత











12 వస్తువులు 1 డజను

12 డజన్లు 1 గ్రోసు

20 వస్తువులు 1 స్కోరు

కాగితం లెక్కలు

24 టావులు 1 దస్తా











పావు రీము 5 దస్తాలు

అర రీము 10 దస్తాలు

ఒక రీము 20 దస్తాలు



సంధులు

సంస్కృత సంధులు -


1.సవర్ణదీర్ఘ సంధి - ఆ,ఇ,ఉ,ఋ లకు సవర్ణములగు అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశంబగును.

ఉదా - రాజు + ఆజ్ఞ = రాజాజ్ఞ,ముని + ఇంద్ర = మునీంద్ర

2.గుణసంధి - అకారమునకు ఇ,ఉ,ఋ లు పరమయినపుడు ఏ,ఓ,ఆర్ లు ఏకాదేశముగా వచ్చెను.

ఉదా - దేవ + ఇంద్ర = దేవేంద్ర, రాజ + ఋషి = రాజర్షి

3.వృధ్ది సంధి - అకారమునకు ఏ,ఐలు పరమైన ఐ కారమును ఓ,ఔ లు పరమైన ఔ కారమును ఏకాదేశముగా వచ్చును.

ఉదా - ఏక + ఏక = ఏకైక,దేశ + ఔన్నత్యము = దేశౌన్నత్యము

4.యణాదేశ సంధి - ఇ,ఉ,ఋ లకు అసవర్ణములగు అచ్చులు పరమగునపుడు వరుసగా య,వ,ర ఔ ఆదేశముగా వచ్చెను.

ఉదా - అతి + అంతము = అత్యంతము, మను + అంతరము = మన్వంతరము

5.అనునాశిక సంధి - క,చ,ట,త,ప లుకు స,మ లు పరమైనపుడు వరుసగా జ,ణ,జ్ఞ,మ లు వికల్పముగా ఆదేశమగును

ఉదా - వాక్ + మయము = వాజ్మయము

6.శ్చత్య సంధి - స,త,థ,ద,ధ,స లకు శ,చ,చ,జ,ఝ,జ్ఞ లు పరమైనపుడు వరుసగా జ్ఞ,ణ,మ లు వికల్పముగా ఆదేశంగును.

ఇదా - మనస్ + శాంతి = మనశ్శాంతి,జగత్ + జనులు = జగజ్జనులు

7. విసర్గ సంధి - విసర్గమునకు శ,ష,స లు పరమైనపుడు వరుసగా శ,ష,స లు ఆదేశబగును

ఉదా - చతు + శతాబ్దములు = చతుశ్శతాబ్దములు

  తెలుగు సంధులు -

1.అకార సంధి - అత్తునకు సంధి బహుళము.

ఉదా - మేన + అత్త = మేనత్త, రామ + అయ్య = రామయ్య

2.ఇకార సంధి - ఏమ్యాదుల ఇత్తునకు సంధి వికల్పము

ఉదా - ఏమి + అంటివి = ఏమంటివి

3.ఉకార సంధి - ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యము.

ఉదా - రాముడు + అతడు = రాముడతడు

4. యడగమ సంధి - సంధిలేని చోట స్వరంబుకంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు రెండు అచ్చులకు సంధి జరగనపుడు వాని మధ్య 'య్' అనునది ఆగమముగా వచ్చును.

5.ఆమ్రేడిత సంధి - అచ్చునకు ఆమ్రేడితము పరమగునపుడు సంధి తరచుగానగును.

ఉదా - కడ + కడ = కట్టకడ, ఏమి + ఏమి = ఏమేమి, మొదట + మొదట = మొట్టమొదట

6.త్రిక సంధి - ఆ,ఈ,ఏ,యను సర్వనామములకు త్రికమని పేరు.

ఉదా - ఈ + త్తనవు = ఈత్తనువు.

7.గసడదవాదేశ సంధి - ప్రదము మీది పరుషములకు గ,స,డ,ద,వ లు బహుళములగును.

ఉదా - రాజ్యము + చేయు = రాజ్యముసేయు, వాడు + వచ్చె = వాడొచ్చె

8.పుంప్వాదేశ సంధి - కర్మధారయ సమాసమున సువర్ణమునకు పుంపు లగును.

ఉదా - సరసము + మాట = సరసపుమాట

9.రుగాగమ సంధి - పేదాదుల కాలు పరమయినపుడు రగాగము వచ్చును.

ఉదా - పేద + ఆలు = పేదరాలు

10.పడ్వాది సంధి - పడ్వాదులు పరమగునపుడు సువర్ణమునకు లోప పూర్ణబిందువులు వికల్పములగును.

ఉదా - భయము + పడు = భయపడు

11.టుగాగమ సంధి - కర్మధారయ సమాసమునందు ఉకారాంత పదమునకు అచ్చు పరమైనపుడు టుగాగమంబగు.

ఉదా - చిగురు + ఆకు = చిగురుటాకు, పండు + ఆకు = పండుటాకు

12.సుగాగమ సంధి - షష్టీ తత్పురుష సమాసమునందు ఉకార ఋకారాంత శబ్దములకు అచ్చు పరమగునపుడు సుగాగమము వచ్చును.

ఉదా - చేయి + అతడు = చేయునతడు

13. ప్రాతాది సంధి - సమాసములందు ప్రాతాదుల తొలి అచ్చుమీది వర్ణములకెల్ల లోపంబు బహుళముగానగును

ఉదా - ప్రాత + ఇల్లు = ప్రాత యిల్లు

14. ఆమ్రేడిత సంధి - అచ్చునకు ఆమ్రేడితము పరమయునపుడు సంధి తరచుగానగును.

ఉదా - ఏమి + ఏమి = ఏమేమి

15.ద్రుత సంధి - ద్రుత ప్రకృతికముల మీద పరుషములకు సరళమగును.

ఉదా - పూచెను + కలువలు = పూచెను గలువలు

16.ము వర్ణలోప సంధి - లు,ల,న లు పరమగునపుడు ము వర్ణమునకు లోపంబు తత్పూర్వస్వరమునకు ధీర్ఘము విభాషమగు.

ఉదా - పొలము + లు = పొలాలు.

17.ద్విగు సమాస సంధి - సమానాధికారణంబగు ఉత్తరు పదంబు పరంబగునపుడు మూడు శబ్దములలో డు వర్ణమునకు లోపంబగును. మీది హాల్లునకు ద్విత్వంబగును.

ఉదా - మూడు + లోకములు = ముల్లోకములు

18.బహువ్రిహి సమాస సంధి - బహువ్రీహిని స్త్రీ వాచ్యంబునగుచో ఉపమానంబు మీది మేనునకు జొడి అగును

ఉదా - అలరు + మేను = అలరు జొడి

19.అల్లోప సంధి - అది, అవి శబ్దముల అకారమునకు సమాసమున లోపము బహుళముగానగు.

ఉదా - నా + అది = నాది

20.దుగాగామ సంధి - నీ,నా,తన శబ్దములకు ఉత్తర పదము పరమగునపుడు దుగాగమము వికల్పముగా వచ్చును.

ఉదా - నీ + చూపు = నీదు చూపు

21.డు వర్ణలోన సంధి - సమానాధికరణంబగు ఉత్తరపదంబు పరంబగునపుడు మూడు శబ్దములోని డు వర్ణమునకు లోపంబగును. మీది