పేజీలు

25 జనవరి 2013

వాస్తు సలహాలు పాటించండిలా...


chaskram

                          వాస్తు సలహాలు పాటించండిలా...



భారతీయ వాస్తు శాస్త్రాల ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తే, జీవితంలో అభివృద్ధి మార్గాల్లో పయనించే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. అందులో కొన్ని సలహాలను పరిశీలిస్తే...

chakrams
■పక్కమీద నుండి దిగగానే తూర్పు వైపుకు కొంచెం నడక సాగించటం మంచిది. దీనివలన తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. మంచి లాభాలు పొందుతారు.

■ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశను చూడటం వలన కుబేర స్థానాన్ని చూసినట్లవుతుంది. దీనివలన ధనాదాయం లభిస్తుంది.



■తూర్పు గోడలోనే దేవుని గూడును ఏర్పాటు చేసుకోవటం మంచిది.



■ఈశాన్య మూలలో దేవుని మందిరాలు నిర్మించటం చేయకూడదు. దీనివలన ఈశాన్య మూల మూతపడటం శుభదాయకం కాదు.



■గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యంలో ప్రారంభమై నైఋతి వైపుకు చెత్తను ప్రోగుచేయండి. ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదు.
Turpu-Padamara

■ఆగ్నేయ మూల వంట చేసేటప్పుడు.. తూర్పు అబిముఖంగా నించుని వంట చేయాలి.

■ఇంటిని ఊడ్చే చీపురు శనీశ్వరుని ఆయుధం. అందుచేత గోడకు ఆనించేటప్పుడు చీపురు హ్యాండిల్‌ పైకి మాత్రమే పెట్టి ఉంచటం శుభకరం.

ఇంటి నిర్మాణానికి అనుకూలం కాని స్థలాలు...

■ఇంటి నిర్మాణానికి అనుకూలమైన స్థలాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని వాస్తు శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అందులో ముఖ్యంగా భారతీయ వాస్తు శాస్త్రాలు తెలిపిన, గృహనిర్మాణానికి పనికిరాని స్థలాల్ని పరిశీలిస్తే...

■స్థలంలోని నాలుగు భుజములు హెచ్చుతగ్గులుగా ఉన్నా, నాలుగు భుజాల కంటే ఎక్కవ భుజాలు కలిగి ఉన్న స్థలం అశుభాలను కలిగిస్తుంది.

■ చేట ఆకారంలో గల స్థలం కూడా మంచిది కాదు. ఎంత సంపాదించినా నిలువ ఉండటం అసాధ్యం. క్రమంగా దారిద్య్రానికి దారితీస్తోంది. నిరంతరం మానసిక అశాంతికి గురికావటం జరుగుతుంది.

■స్థలం లోని పొడవు ఎక్కువగా ఉండి, భుజములు హెచ్చు తగ్గులుగా ఉండే స్థలం మంచిది కాదు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే పశుహాని, అనారో గ్యం కలిగిస్తుంది.

■విసనకర్ర ఆకార స్థలం... ఎటువంటి ఆస్తి మంతుల్నైనా ఆర్థికంగా అణగారిపోయేలా చేస్తుంది.



■లాగుడు బండి ఆకారంలో ఉండే స్థలం ఆర్థిక పతనానికి దారి తీస్తోంది.



■డమరకపు ఆకారంలో ఉండే స్థలం మంచిది కాదు. సంతానం కలగటంలో సమస్యలు నేత్ర సంబంధిత రోగాలు కలుగుతాయి.



■కుంభాకార స్థలం, భయం, అంటు వ్యాధులు, సుఖశాంతులు లోపించటం జరుగుతుంది.



■మద్దెల ఆకారంలో గల స్థలాలు భాగస్వాముల మధ్య వివాదాలను, విడిపోయే ఆస్కారాలను అధికంగా కలిగిస్తాయి.



■అర్థ చంద్రాకార స్థలాల వలన మానసిక భ్రాంతి కలుగుతుంది. తరచుగా దోపిడీలు జరుగుతుంటాయి.

గృహావరణలో మెట్లు...

మెట్లను నిర్మించటంలో కొన్ని పద్ధతులను పాటించాలని వాస్తు శాస్త్రాలు తెలుపుతున్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మెట్లను ఏవిధంగా నిర్మిస్తే శుభదాయకాలనే అంశాలను పరిశీలిస్తే...



■మేడపైకి మెట్లు నిర్మించేటపుడు ఒక వరుస మెట్లను... తూర్పు నుండి పడమరకు లేదా, ఉత్తరం నుండి దక్షిణానికి ఎక్కే విధంగా నిర్మించాలి.



■ రెండు వరుసలుగా నిర్మించేటపుడు.. మొదటి వరుస మెట్లను.. తూర్పు నుండి పడమరకు వెళ్ళే విధంగానూ, రెండవ వరుస మెట్లు ఏ దిక్కుకైనా తిరిగినా పడమర నుండి తూర్పుకు ఎక్కే విధంగా నిర్మించాలి.



■రెండు వరుస మెట్లను నిర్మించేటపుడు ఒక వరుస ఉత్తరం నుండి దక్షిణం వైపు ఎక్కేవిధంగానూ, రెండవ వరుస.. ఎటు తిరిగినా దక్షిణం నుండి ఉత్తరం ఎక్కేవిధంగా నిర్మించుకోవచ్చు.



■ఈశాన్య దిక్కుగా మెట్లను నిర్మించేటప్పుడు గృహానికి తూర్పు, ఈశాన్యం లేదా ఉత్తర - ఈశాన్యాలవైపు నిర్మించుకోవచ్చు.



■ఈశాన్యం వైపు నిర్మించే మెట్లు ప్రహరీ గోడకు సమీపంలో ఉండకూడదు.



■మెట్లను ఎల్‌ ఆకారంలో ఉండే విధంగా నిర్మించాలనుకునే వారు ముందు తూర్పు నుండి పడమరకు గానీ, లేదా ఉత్తరం నుండి దక్షిణానికి గానీ ఎటువైపుకైనా నిర్మించుకోవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి