పేజీలు

25 జనవరి 2013

ఏకాగ్రతకు వాస్తు




                                       ఏకాగ్రతకు వాస్తు
                         
                           daily-schedule
           చదువుకునే పిల్లల్లో పరీక్షలకు సంబంధిం చిన ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది. ఎంత తెలివైన పిల్లలైనా, రోజూ చదువుతూ ఉండేవారైనా పరీక్షలు అనగానే తెగ హైరానా పడిపోతుంటారు. దానితో వారి ఏకాగ్రత దెబ్బతిని చిరాకు పడిపోవడం కూడా కనిపిస్తుంది. ఈ ఒత్తిడి కారణంగా పుస్తకాలు తెరిచినా వారు దానిపై దృష్టి కేంద్రీకరించలేరు.వాస్తవానికి వారి ఒత్తిడికి ప్రధాన కారణం పాఠశాల, కళాశాలల్లో ఉపాధ్యాయులు, ఇంటివద్ద తల్లిదండ్రులే. పరీక్షలకు బాగా చదువుకోవాలని, ఇతరులకన్నా ముందుండాలనే మాటలతో వారిని హైరానాపెట్టేస్తారు.


సరిగ్గా చదవకపోతే ఒక సంవత్సరం వృధా అయిపోతుం దంటూ భయపెడుతుంటారు. ఇది పిల్లల్లో అ ధిక ఆందోళనను పెంచడమే కాదు పరీక్షలం టేనే ఒకరకమైన భయమేర్పడిపోతుంది. పిల్ల లు అటువంటి ఒత్తిడి లేకుండా రిలాక్స్‌డ్‌గా ఉండటమే కాక చదువుకోవడాన్ని శ్రమ అని భావించకుండా ఉండగలగాలి. అప్పుడే వారు చదివినదానిని ఎటువంటి ఒత్తిడికి లో నుకాకుండా ఆకళింపు చేసుకోగలుగుతారు. పదే పదే చెప్పడమనేది వారి లేత మెదడులపై ఒత్తి డి పెంచి హాని చేస్తుందే తప్ప సహాయపడదు.పిల్లల ఏకాగ్రతకు దోహదం చేసే వాస్తుపరమైన టిప్స్‌ కొన్ని ఉన్నాయి. అవి వారిలో ఒత్తిడిని తగ్గించేందుకు, పరీక్షలను నిర్భయంగా ఎదుర్కొనేందుకు సహాయపడతాయి.

chidran-runపిల్లలు...

తమ తలను ఉత్తర లేదా పడమర దిశగా తలపెట్టుకొని పడుకోనివ్వకండి.

అబ్బాయి అయితే అతడు ఇంటికి వాయు వ్యంలో పడుకోవడం కానీ గదిలో వాయువ్య దిక్కున పడుకోవడం కాని మానివేయాలి.

అలాగే అమ్మాయి అయితే ఇంటి ఆగ్నేయంలో లేదా గదిలో ఆగ్నేయదిక్కున పడుకోవడం మంచిది కాదు.

పడకగదికి అద్దాలను పెట్టకండి.

అలాగే పిల్లలు చదువుకునే ప్రాంతంలో దక్షిణ, పశ్చిమ దిక్కులలో అద్దా లు లేకుండా చూడాలి.

పిల్లలు తూర్పు లేదా ఉత్తర ది క్కువైపు కూచుని చదువుకోవాలి.

పిల్లల స్టడీ టేబుల్‌, ఆ ప్రాంతం కూడా శుభ్రంగా ఉండాలి. బల్ల మీద, చుట్టూ పుస్తకాలు, కాగితాలు ఉండరాదు.

స్టడీ ఏరియా ఇంటికి ఈశాన్య దిక్కులో ఉండాలి లేదా గదిలో ఈ శాన్యం దిక్కున ఉండాలి.

ఒత్తిడి అధికంగా ఉంటే నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూచునే ఇంటి డ్రాయింగ్‌ రూంలోని ఈశాన్యంలో అక్వేరియం, లేదా వాటర్‌ ఫౌంటెన్‌ లేదా వెదురు మొక్కలు పెట్టుకోవాలి. అయితే మూలలకి మాత్రం వద్దు.

పడక గదుల్లోనూ, స్టడీ ఏరియాలోనూ ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులను (ముదురు, లేత షేడ్లలో) వేసుకోవాలి. గోడలకు రంగులుగా కాకపోతే కనీసం పక్కమీద దుప్పట్లు, స్టడీ టేబుల్‌ క్లాత్‌గా, కాళ్ళు తుడుచుకునే పట్టాలు, కర్టెన్లు, గలీబులు వగైరాలకు వాడవచ్చు. ఇన్‌డోర్‌ మొక్కలను కూడా విరివిగా వాడుకోవచ్చు.

తినేటప్పుడు ఆడపిల్లల అయితే తూర్పు ముఖంగా, మగపిల్లవాడు అయితే ఉత్తర ముఖంగా కూచొని భోంచేయాలి.

ప్రతి రోజూ ఒకే చోట, ఒకే దిక్కులో కూ చునేట్టు పిల్లలను ప్రోత్సహించాలి. దానివల్ల ఆ ప్రాంతంలో పిల్లల సానుకూల సానుకూల ఆరా (్చఠట్చ) బలపడేలా చేస్తుంది.

పిల్లల స్టడీ, పడకను ఇతరులు ఉపయోగించడాన్ని అనుమతించరాదు.

ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులు తినడానికి ఇవ్వండి.

పెద్దగా పాటలు, సంగీతం పెట్టి పిల్లల ఏకాగ్రత దెబ్బతిని, ఒత్తిడి పెరిగేందుకు దోహదం చేయకండి.

ఒకవేళ సంగీతం పెట్టినా చాలా సున్నితంగా ఉండేది, తక్కువ వాల్యూమ్‌లో రాత్రి బెడ్‌రూమ్‌లో పెట్టవచ్చు.

ఇది గాయత్రి మంత్రమైనా పర్వాలేదు.

గోడలకు కోణంలో ఉండే తలుపు ఉన్న గదిలో చదవడం కానీ నిద్రపోవడం కానీ చేయరాదు.

పిల్లలకు ఎప్పుడూ తల్లిదండ్రులు సానుకూలమైన మాటలనే చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో నూ వారి వెంటే ఉంటామనే హామీ ఇవ్వడమే కాకుండా పిల్లల బలాల గురించి సానుకూల వ్యాఖ్యలు చేయాలి. ముఖ్యంగా పిల్లలు తినేటప్పుడు వారి బలహీనతల గురించి వైఫల్యాల గురించి మాట్లాడరాదు. మీరు వారిని ప్రేమిస్తున్నారనే భావన వారిలో కలగాలి.

ఆటలు కానీ సంగీతం కానీ వింటూ రిలాక్స్‌ అయ్యేందుకు అనుమతించాలి.

పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత అది కొనిస్తాం అని హామీలు ఇవ్వరాదు. అలాకాకుండా వారు పరీక్షలకు తయారవుతున్న సమయంలో వారికి చిన్న చిన్న కానుకలిచ్చి ప్రోత్సహించాలి. వారు కష్టపడుతున్నారని, తెలివైన వారని గుర్తించిన విషయాన్ని వారికి చెప్పాలి. సానుకూల, ప్రోత్సాహకర సూచనలు ఇస్తూ మీ మద్దతు వారికి ఎప్పుడూ ఉంటుందనే భావన వారిలో కలిగేలా చేయండి.

వారు వ్యాయామం, ధ్యానం చేసి రిలాక్స్‌ అయ్యేలా ప్రోత్సహించండి కానీ బలవంతం చేయవదు. మీ పిల్లల దృష్టిని మరల్చే ఏ వస్తువునీ స్టడీ ఏరియాలో ఉంచరాదు. అది టేప్‌ రికార్డర్‌ అయినా టెలివిజన్‌ అయినా వెంటనే అక్కడ నుంచి తీసివేయాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి